రైతు భాందవుడు సిఎం కేసిఆర్

అన్నదాతలకు అండగా కేసీఆర్

గడ్డం స్ఫురధర్ రెడ్డి

వేములపల్లి అక్షిత ప్రతినిధి : అన్నదాతలకు అండగా నిలిచి అన్నివిధాలుగా చేయూతనందిస్తున్న నాటి తెలంగాణ ఉద్యమనాయకుడు నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధావుడు అని వేములపల్లి మండలం సల్కునూరు ప్రాథమిక వ్యవసాయ రైతు సహకార సంఘం చైర్మన్ గడ్డం. స్ఫురధర్ రెడ్డి అన్నారు. ఆదివారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ కరోనా బారినపడి యావత్ ప్రపంచ ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయినప్పటికి తెలంగాణలో రైతుల పక్షపతిగా పేరొందిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు, బీమా, రూ 50 వేల లోపు రైతులరుణాలను మాఫీ చేస్తూ నిధులు విడుదల చేయడం పట్ల రైతుల పక్షాన సిఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.దేశంలో ఎక్కడ లేనివిదంగా రైతులకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ప్రాజెక్టులద్వారా సాగునీరు,అందించడమే కాకుండా వానాకాలంపంటపెట్టుబడికి రైతుబందు ఆర్థిక సహాయం2021-22సంవత్సరానికి రైతు బీమా పథకం అమలుకు800కోట్ల రూపాయల విడుదల, రుణమాఫీ అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వంమేనన్నారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తోపాటు మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు. భాస్కర్ రావు లకు వేములపల్లి మండల రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *