తెలుగు వెలుగుల ఠీవి… మన పీవీ

పంచాయతి రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ అర్బన్, అక్షిత బ్యూరో :తెలుగువారి ఠీవి పీ.వీ.నరసింహారావు అని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.సోమవారం నాడు మాజీ ప్రధానమంత్రి పివి శతజయంతి ఉత్సవాలసందర్భంగా స్థానికహన్మకొండ jns స్టేడియం లోని పి.వి. నర్సింహా రావు విగ్రహానికి పూల మాల వేసి నివాళులు ఘనంగా నివాళులు మంత్రి దయాకర్ రావు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ..రాష్ట్ర ప్రభుత్వం పివి జన్మించి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పీవీ శత జయంతి ఉత్సావాలను ఏడాది పొడవునా ఘనంగా నిర్వహిస్తుందని తెలిపారు.పివి గురించి ఎంతచెప్పినా తక్కవే అని,మంత్రిగా ,ముఖ్యమంత్రిగ,కేంద్రమంత్రిగా,దేశప్రధానిగాఎదిగిన పివి నిజాయితీపరుడనీ,ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని తెలిపారు.హంగు ఆర్బాటాలు లేకుండా ఎంత ఎదిగిన ఒదిగి ఉండే లక్షణం పీవీ గారిదని అన్నారు.ఆయన రాజకీయ ఎదుగుదల మన ప్రాంతం నుండే జరిగిందని తెలిపారు తాను పీవీ కి అభిమానినని,పీవీ శిష్యుడని చెప్పుకోవడానికి గర్వపడుతానీ చెప్పారు.తీవ్రవాదం అణిచివేయాడానికి పీవీ అన్ని చర్యలు తీసుకున్నారని తెలిపారు.తెలంగాణ ప్రాంతం కన్న ముద్దు బిడ్డ పీవి అని, ఉమ్మడి వరంగల్ జిల్లా తో ఆయనకు మంచి అనుబంధం ఉందనిగుర్తు చేసుకున్నారు .లక్నపల్లిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. పీవీ స్వయంగా వందల ఎకరాలకు యజమాని ఐనప్పటికీ, భూ సంస్కరణలు అమలు చేసి, పేదలకు భూములు అందేలా చేసిన మహనీయుడు పివి అని మంత్రి అన్నారు.ప్రభుత్వ విప్ వినయ భాస్కర్ మాట్లాడుతూ దేశ, విదేశాలలో పివి శతజయంతి ఉత్సావాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డు కు పివి మార్గ్ గా మార్చడమైందని తెలిపారు.ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ బాబు, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా పరిషత్ చైర్మెన్ సుధీర్ కుమార్, కూడా చైర్మెన్ మర్రి యాదవ రెడ్డి, గ్రంధాలయ చైర్మెన్ అజిస్ ఖాన్, పివి నరసింహరావు బంధువులు ,మదనమోహన్ తదితరులు పూల మాల వేసి నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *