పువ్వాడ రెండేళ్ల జర్నీ…

రవాణా వ్యవస్థలో పువ్వాడ రెండేళ్ల జర్నీ
పతాక శీర్షికన …ఖమ్మం ప్రగతి
బొమ్మెర రామూర్తి
ఖమ్మం, అక్షిత బ్యూరో : రవాణా వ్యవస్థలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ది రెండేళ్ల జర్నీ. కునారిల్లుతున్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు పువ్వాడ తమదైన శైలిలో వ్యవహరించిండ్రు. ఆర్టీసీలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి కార్గో సేవలకు పునాది వేసిండ్రు. కార్గో సేవలతో ఏడాదిన్నర కరోనా కష్ట కాలంలోనూ ఆర్టీసి మనుగడకు కార్గో ఊపిరిలూదింది. కార్గోను మరింత పటిష్టవంతం చేసేందుకు మరింత కృషి చేస్తుండ్రు. అందుకు తోడు సీనియర్ ఐపిఎస్ అధికారి సజ్జన్నార్ ఆర్టీసి ఎండీగా బాధ్యతలు స్వీకరించడంతో మరింత ఉరుకలెత్తనుంది. ఇక ఖమ్మం ప్రగతిని పరిశీలిస్తే మంత్రి పువ్వాడ అజయ్అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతూ రూపు రేఖలను మార్చారని టీఆర్ఎస్ సీనియర్ నేత, మధిర నియోజక వర్గ మాజీ ఇంచార్జీ బొమ్మెర రామూర్తి తెలిపారు. ఖమ్మం జిల్లాను రాష్ట్రంలోనే అభివృద్ధిలో ప్రగతి పథంలో పయనింప చేసేందుకు విశిష్ఠ కృషి చేస్తున్నారన్నారు. రవాణా మంత్రిగా పువ్వాడ అజయ్ వాక్సుద్ది, చిత్తసుధ్ది, సంకల్పసిధ్ది కలిగి ఉన్న ఏకైక నాయకుడన్నారు. మంత్రిగా రెండేళ్ళ పయనం పూర్తి చేసుకోవడం అభినందనీయమని బొమ్మెర రామ్మూర్తి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *