ప్రజారోగ్యం, పరిశుభ్రతకు పెద్దపీట

‘స్వచ్ఛ తెలంగాణ’ వైపునకు సమిష్టి అడుగులు
చెత్తతో మానవజీవనానికి ముప్పు

స్వాహా రిసోర్స్ మేనేజ్మెంట్ సంస్థ ప్రతినిధుల బృందం సమావేశంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :స్వచ్ఛ తెలంగాణ సాధన కోసం సమిష్టి కృషి చేయాలని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పిలుపునిచ్చారు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయాన్ని ఇండోర్ కు చెందిన స్వాహా రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రతినిధుల బృందం శుక్రవారం సందర్శించింది. ఈమేరకు ప్రతినిధి బృందం సభ్యులు మున్సిపాలిటీల అభివృద్ధి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, డంపింగ్ యార్డుల ప్రాధాన్యం, చెత్త సేకరణ, రీసైక్లింగ్ తదితర అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భాస్కర్ రావు మాట్లాడారు. చెత్త తో మనవజీవనానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. పట్టణంలో నిత్యం కొన్ని మెట్రిక్ టన్నుల చెత్త వస్తుందన్నారు. కుప్పలు, గుట్టలుగా పేరుకుపోయిన చెత్త ను రీసైక్లింగ్ చేసేందుకు వీలుగా ప్రభుత్వం డంపింగ్ యార్డుల నిర్మాణాలు చేపడుతోందని అన్నారు.స్వచ్ఛ సర్వేక్షన్ మార్గదర్శకాలను లోబడి వీటి నిర్మాణాలను చేపడుతోందని చెప్పారు. ప్రతీ మున్సిపాలిటీ పరిధిలో సెగ్రిగేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారని అన్నారు. పైలెట్ ప్రాజెక్ట్ గా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని గండిపేట, ఖానాపూర్ ప్రాంతాల్లో వీటి నిర్మాణాలు చేపట్టారని అన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో ఇండ్ల నుంచి తడి, పొడి చెత్తను సేకరించేందుకు చెత్త బుట్టలను పంపిణీ చేశామని అన్నారు. పొడి చెత్త ను రీసైక్లింగ్ ప్లాంట్ లకు తరలిస్తారని, తడి చెత్తను వర్మీ కంపోస్టు ప్లాంట్ లలో మూడు నెలలపాటు నిల్వ ఉంచి సేంద్రీయ ఎరువుగా మార్చి రైతులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో, మున్సిపల్ కార్పొరేషన్ లలో మానవ ఘన వ్యర్ధాల నిర్వహణ ( ఎఫ్ఎస్టీపీ) కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్ధేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపడుతున్నట్టు భాస్కర్ రావు తెలిపారు. పట్టణ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, కమిషనర్ చీమ వెంకన్న, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్, యువనేత నల్లమోతు సిద్దార్ధ, కౌన్సిలర్లు ఉదయ్ భాస్కర్, ఇలియాస్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *