పిఎంజెడబ్ల్యూఏ రాష్ట్ర అధ్యక్షులుగా మాతంగి దాస్

ప్రాంతీయ పత్రికల పరిరక్షణకు కృషి

 మాతంగి దాస్
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
ప్రింట్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్ట్ మాతంగి దాస్ ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో పిఎంజెడబ్ల్యూ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సంఘ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు మహ్మద్ రియాజుద్దీన్ గత కొంతకాలం క్రితం అకాల మరణం చెందిన విషయం విదితమే. తొలుత రియాజుద్దీన్, పడకంటి రమేష్ లతో పాటు మృతి చెందిన జర్నలిస్టులకు సంతాపం వ్యక్తం చేశారు. ఆనంతరం జరిగిన ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న దాస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గోళ్ళ రమేష్, కోశాధికారిగా కర్నాటి లక్ష్మీ నారాయణ ( రవి), ఉపాధ్యక్షులుగా యువరాజు, మగ్దూం, ఎండి నజీం సహాయ కార్యదర్శిగా సత్యంతో పాటు హైదరాబాద్ గ్రేటర్ అధ్యక్షుడుగా అహ్మద్ అలీ, ప్రధాన కార్యదర్శిగా కొమర్రాజు శ్రీనివాసులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోటగిరి చంద్రశేఖర్, మక్సూద్, ప్రచార కార్యదర్శి పల్లె నవీన్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమారపు యాదయ్య, చిట్యాల శ్రీనివాసరావు, షేక్ అహ్మద్ అలీ, మహమ్మద్ నజీమ్, కొమర్రాజు శ్రీనివాసులు, యువరాజు, సత్యం పాల్గొన్నారు.

ఇంచార్జీ డైరెక్టర్ కు వినతి

చిన్న, మధ్య తరహా పత్రికలు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికై సమాచార పౌర సంబంధాల శాఖ ఇంచార్జ్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లేకు ప్రింట్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మాతంగి దాస్ వినతి పత్రాన్ని సమర్పించారు. చిన్న పత్రికలకు ప్రతిబంధకంగా పరిణమించిన ప్రింటింగ్ ప్రెస్ నిబంధనను తొలగించి, రేట్ కార్డులను సవరించి అఫ్ గ్రేడింగ్ ప్రక్రియను వెంటనే చేపట్టాలని కోరారు. ప్రతి నెల రెగ్యులర్ గా జారీ చేసే ప్రకటనలు గత రెండేళ్లుగా నిలిచిపోయాయని వాటిని
వెంటనే పునరుద్ధరించి.. చిన్న, మధ్య తరహా పత్రికల మనుగడకు చేయూత నందించాలన్నారు. కరోనా కాలంలో
8 నెలల క్రితం అడ్ హక్ బేసిస్ లో చేపట్టిన ఎంపానల్ మెంట్ పత్రికలకు అక్రిడిటేశన్ కార్డులు జారీ చేయాలని, వాటిని రెగ్యులర్ ఎంపానల్ గా గుర్తించి అన్నీ సౌలభ్యాలు కల్పించాలన్నారు. అఫ్ గ్రేడింగ్ కు జర్నలిజం అనుభవాన్ని సైతం పరిగణలోకి తీసుకోవాలని తదితర సమస్యలపై నాగయ్యకు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *