ప్రీతి కుటుంబానికి చేయూత

రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి
తాళ్ళపల్లి రవి
కేతేపల్లి, అక్షిత న్యూస్ : ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియాను అందించి ఆదుకోవాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తాళ్ళపల్లి రవి డిమాండ్ చేశారు. శుక్రవారం మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య ఆదేశానుసారం నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామంలో చింతమల్ల ప్రీతి కుటుంబాన్ని పరామర్శించి కొంత చేయూత నందించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొప్పోల్ కు చెందిన దళిత విద్యార్థిని అదే గ్రామానికి చెందిన దోరపల్లి పవన్ …ప్రేమ పేరుతో ప్ తల్లిదండ్రులు పడుకున్న తర్వాత అర్ధరాత్రి సమయంలో దోస్తులతో కలిసి ప్రీతిని అపహరించుకు పోయి లైంగికంగా వేధించి హత మార్చారన్నారు. తండ్రి చింతమల్ల శ్రీను, తల్లి చింత మల్లనాగమ్మలకు చెందిన ఏకైక సంతానం చనిపోయిoదని, నిరుపేద కుటుంబానికి చెందిన చింత మళ్ల శ్రీను కుటుంబానికి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపల్లి, మహిళా సంఘం మాల ఉద్యోగుల సంఘం నుండి రూ.5 వేలు, 75 కేజీల బియ్యం అందజేసి ఓదార్చారు. ప్రభుత్వం తక్షణమే ఆ కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా, మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్, వికలాంగుడైన తండ్రికి ఒక ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర నాయకురాలు గాజుల పున్నమ్మ, మిర్యాలగూడ టౌన్ అధ్యక్షురాలు పేరుమల్ల ధనమ్మ, త్రిపురారం మండలం అధ్యక్షురాలు అంగరాజు స్వర్ణలత, నాగార్జునసాగర్ నియోజకవర్గ కన్వీనర్ పేయ్యల గీత, కొచ్చర్ల కుమార్, సుశీల, శ్రీకాంత్, తాళ్లపల్లి ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *