ప్రతిభకు డిజిపి ప్రశంస

ప్రతిభ కనబర్చిన నల్లగొండ జిల్లా పోలీసులు
* అవార్డులు ప్రదానం చేసిన డీజీపీ

నల్లగొండ, అక్షిత ప్రతినిధి :వివిధ విభాగాలలో ప్రతిభ కనబర్చిన నల్లగొండ జిల్లా పోలీసు అధికారులకు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ లో అవార్డులను ప్రదానం చేశారు. ఐఓ విభాగంలో నల్లగొండ టూ టౌన్ ఎస్ఐ.నర్సింహులు, కనగల్ ఎస్ఐ సతీష్ రెడ్డి, హాలియా ఎస్ఐ శివ కుమార్, ఎస్ హెచ్ఓ వర్టీకల్ విభాగంలో నల్లగొండ టూ టౌన్ ఎస్ఐ నర్సింహులు, దేవరకొండ ఎస్ఐ శీనయ్య, కోర్టు డ్యూటీ విభాగంలో నల్లగొండ రూరల్ కానిస్టేబుల్ బొప్పని సుమన్, హాలియా కానిస్టేబుల్ మూడావత్ శ్రీనివాస్, నల్లగొండ టూ టౌన్ కానిస్టేబుల్ దుర్గారాజు, స్టేషన్ రైటర్ విభాగంలో విజయపురి టౌన్ కానిస్టేబుల్ వి.కిరణ్, టెక్ టీమ్ విభాగంలో నల్లగొండ రూరల్ మహిళా కానిస్టేబుల్ వి.రేణుకలకు అవార్డులందించి అభినందించారు. ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందిస్తూ తెలంగాణ పోలీస్ గౌరవాన్ని పెంపొందించాలని సూచించారు.అవార్డులు గెలుపొందిన పోలీసులను డీఐజీ, జిల్లా ఎస్పీ రంగనాథ్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *