జనాభా స్థిరీకరణకు కృషి

జనాభా స్థిరీకరణకు ప్రతి ఒక్కరూ భాధ్యత తీసుకోవాలి

బాల్య వివాహాలను అరికట్టాలి

మహిళల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి

అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్

సూర్యాపేట, అక్షిత బ్యూరో : జనాభా స్థిరీకరణకు ప్రతి ఒక్కరూ భాధ్యత తీసుకోవాలని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. ఆదివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ’ ఆపదలో కూడా కుటుంబ నియంత్రణకు సంసిద్దిత, సమర్దవంతమైనదేశం మరియు కుటుంబాల యొక్క సంపూర్ణ భాద్యత “”ప్రస్తుతం ప్రపంచాన్ని తీవ్ర ఆరోగ్య అత్యయిక పరిస్థితిని కలిగించిన కోవిడ్ -19 మహమ్మారి నుండి బయటపడుతున్న ప్రస్తుత తరుణంలో దృష్టి సారించ వలసిన ముఖ్య అంశం జనాభా “స్థిరీకరణ’’. జనాభా పెరుగుదల వల్ల కలిగే అవసరాలు, అనర్దాలు, సామాజిక అసమానతలు, ఆర్దిక సమస్యల పై వివరించారు. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ప్రపంచ జనాభాకు 100 కోట్ల జనాభా ఆధనంగా చేరుతుంది, అయితే 1999 నుండి 95 శాతం జనభా పెరుగుదల అభివృద్ది చెందుతున్న దేశాలలో జరుగుతుందని అభివృద్ది చెందిన దేశాలలో జనాభా పెరుగుదల రేటు చాలా తగ్గిపోయి, దాదాపు నిలకడగా స్థిరంగా ఉన్నది దీనికి తోడు సగటు ఆయుప్రమాణము ఘననీయంగా పెరగడంతో ప్రపంచ వ్యాప్తంగా వృద్దుల జనాభా ఆయా దేశాలకు శాపంగా మారినదని అన్నారు. జిల్లాలో కుటుంబ సంక్షేమం కొరకు పనిచేస్తున్న సిబ్బంది అందరినీ అభినందించారు. ఉత్తమ సర్జన్ డా. కె. మమత, ఉత్తమ స్టాఫ్ నర్స్ హైమావతి, ఉత్తమ సూపర్వైజర్ శిరోమణి, ఉత్తమ మహిళా ఆరోగ్య కార్యకర్త గోవిందమ్మ, ఉత్తమ ఆశా కార్యకర్త సుజాత లను జ్ఞాపిక ప్రశంశా పత్రంతో సత్కరించినారు. ప్రస్తుతము మన దేశంలో 59 శాతం మంది ప్రజలు ఉత్పాధక శక్తి గల యువత ఉన్నారని ఇది ప్రపంచములో మరే దేశంలో లేని మానవ వనరులని అందుకే ప్రపంచం మొత్తం పనిశక్తి, మేధాశక్తి, ఉత్పాధకత శక్తి గల మన దేశం వైపు దృష్టి మలుస్తున్నరని అన్నారు. 1955 లో మన దేశంలో అధిక పునరుత్పత్తి రేటు 5.9 గా ఉండగా అది ప్రస్తుతము 2.2 గా నమోదైనదని అన్నారు. అనంతరం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. కోటాచలం మాట్లాడుతూ మన జిల్లా జనాభా 11 లక్ష్యల అంచనా వేయనైనదని ప్రస్తుత మన జిల్లా జననాల రేటు1000 జనాభాకు 16.9 ఉన్నదని అన్నారు. మరణాల రేటు 6.3 గా ఉన్నదని , ప్రతి సంవత్సరం 1000 జానాభాకు అదనంగా 10 మంది జమ అవుతున్నారని తెలిపారు. దీనివలన ఎన్ని ప్రణాళికలు చేసినా జనాభా విస్ఫోటం వలన అనేక ఆర్ధిక, ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. కావున ప్రజలందరి అవగాహన కార్యక్రమాల ద్వారా చైతన్యపరచి జనాభా స్థిరీకరణకు ప్రతి ఒక్కరూ భాద్యత వహించాలని ప్రపంచ జనాభా దినోత్సవ ఉద్దేశ్యం అని తెలిపారు. జనాభా పెరుగుదలకు ప్రధాన కారణాలు: బాల్యవివాహాలు, పెళ్లి జరిగిన వెంటనే పిల్లలు కనడం, కానుపుకు కానుపుకు మధ్య ఎడం లేకపోవడం, మగపిల్లలకోసం ఎదురుచూడడం వలన జనాభా పెరుగుదల ఉంటుందని దీనిని గమనించి ప్రజలు కుటుంబ నియంత్రణ పద్దతులగురించి తెలుసుకుని పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు, డెమో అంజయ్య గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *