కష్టాల్లో ఉన్నోళ్లకు యోగానంద్ ఆసరా

పేదలకు ఆర్థిక చేయూత
కష్టాల్లో ఉన్నోళ్లకు ఆసరా
గజ్జల యోగానంద్
శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి :
కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయాయి. వారి ఆదాయవనరులు దెబ్బతిని కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ వైరస్ బారిన పడి అనేక వెతలను ఎదుర్కుంటున్న కొన్ని కుటుంబాలను గుర్తించి వారికి వాసవి ఫౌండేషన్ ఫర్ ఎంపవర్‌మెంట్ ద్వారా జూన్ 29న తారనగర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో గజ్జల యోగానంద్ చెక్ రూపేణా ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా యోగానంద్ మాట్లాడుతూ ఈ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు గాను వరుసగా 3 నెలల పాటు నెలకు రూ 5000 /- చొప్పున ఈ సహాయం అందజేయబడుతుందని తెలియజేశారు. ఇంతకుమునుపు 100 కుటుంబాలకు, నేడు 20 కుటుంబాలకు కలిపి ఇప్పటివరకూ మొత్తం 120 కుటుంబాలకు ఈ సహాయం అందజేసినట్లు తెలిపారు. కోవిడ్ కష్టాలను మనోబలంతో తిప్పికొట్టవచ్చని, జీవితంలో ఆటుపోట్లు సహజమని తెలియజేస్తూ ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మరిందరు బాధితులకు భవిష్యత్తులో కూడా అవసరమైన మేరకు సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. జి.వై ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ కూడా అయిన శ్రీ యోగానంద్ తమ ఫౌండేషన్ కరోనా బాధితులకు కావలసిన సహాయ సహకారాలు అందించడం, హైడ్రోక్లోరిట్ పిచికారీ వాహనం ఏర్పాటుచేయడం, మందులు, ఆహార పొట్లాల సరఫరా చేయడం ఎంతో తృప్తిని ఇచ్చిందని, ఈ కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడం ఒక సామాజిక భాద్యతగా భావిస్తున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజు శెట్టి, గాదె గోపాల్ ,మారం వెంకట్, సత్య , సత్యనారాయణ గుప్త, రామిరెడ్డి,ఎల్లేష్, రమేష్ సోమిశెట్టి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *