పేదలకు ఉచిత వైద్య సేవలు

ఉచిత వైద్య శిబిరాలతో మనోధైర్యం

డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :ఉచిత వైద్య శిబిరాలతో మనోధైర్యం లభిస్తుందని హెల్పింగ్ హ్యాండ్స్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వాకర్స్ అసోసియేషన్, నల్లగొండ జిల్లా హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ మాట్లాడారు. ప్రతినెల ఒకటో తేదీన నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా శిబిరానికి వచ్చిన వారికి ఉచిత రక్తపరీక్షలు, బీపీ, షుగర్, థైరాయిడ్ పరీక్షలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతి రోజు వ్యాయామం చేయాలని, వైద్యుల సలహాల మేరకు ఆరోగ్య నియమాలను పాటించాలని డాక్టర్ మునీర్ కోరారు. వైద్య శిబిరానికి వచ్చిన రోగులకు అను మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్ బాలాజీ సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు. గత మూడేండ్ల నుంచి నిర్విఘ్నంగా ఉచిత విద్య శిబిరాలు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్, బృందాన్ని డాక్టర్ బాలాజీ, ఎంఈవో బాలాజీ నాయక్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, హెల్పింగ్ హ్యాండ్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి పొగుల సందీప్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మణ్, యాదగిరి, రమేష్, లక్ష్మణ్, శ్రీనివాస్ రెడ్డి,రోహిత్, నవీన్, సాయి, కృష్ణ, జానకిరామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *