వాయు కాలుష్య నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత

అదనపు కలెక్టర్ రాహూల్ శర్మ
నల్గొండ, అక్షిత ప్రతినిధి : వాయు కాలుష్య నివారణకు, స్వచ్ఛమైన, ఆరోగ్యకర వాతావరణం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరం లో ఇంటర్నేషనల్ డే అప్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ వర్క్ షాప్ లోముఖ్య అతిథి గా పాల్గొని మాట్లాడుతూ స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన భూగోళం అనే అంశము తో ఈ సంవత్సరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ వాడకం నియంత్రించాలని, పర్యావరణ కాలుష్యం లేకుండా మట్టి విగ్రహాలు వినాయక చవితి పండుగ సందర్భంగా పూజించాలని కోరారు. పర్యావరణాన్ని పరిరక్షణ కు ఆయా శాఖల అధికారులు ప్రజల్లో అవగాహన కలిగించాలని ఆయన అన్నారు. ప్రభుత్వం పచ్చదనం,పర్యావరణ పెంపుకు హరిత హారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు. 15సం..దాటిన వాహనాలను వినియోగంతో కాలుష్యం రాకుండా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆయా శాఖలు తమ పరిధి లో కాలుష్య నియంత్రణకు చేస్తున్న కార్యక్రమాలు వివరించారు. పర్యావరణ నియంత్రణ మండలి ఈ ఈ బి.రాజేందర్ మార్లాడుతూ కాలుష్య నియంత్రణ మండలి నిరంతర కృషి,వివిధ శాఖల సమన్వయం తో జిల్లాలో వాయు కాలుష్య సూచీ మెరుగు పడినట్లు తెలిపారు. జిల్లా
వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పంటను కోసిన తరువాత వాటిని తగులబెట్ట కుండా, వాటిని వదిలి వేయడం ద్వారా సహజ సిద్ద ఎరువు తయారు అవుతుందని తెలిపారు .సహాయ పౌర సరఫరాల అధికారి నిత్యానందం మాట్లాడుతూ ప్రతి పెట్రోల్ పంపులలో కనీస వసతులు,కల్తీ లేకుండా పెట్రోల్, డీజిల్ పోయేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ ఎస్.ఐ.శ్రీనివాస్ మాట్లాడుతూ వాహన కాలుష్యం నియంత్రించుటకు ప్రతి వాహనమునకు తనిఖీ చేసి సర్టిఫికెట్ చేస్తున్న ట్లు తెలిపారు. ఆర్టీసీ డివిజినల్ మేనేజర్ శ్యామల మాట్లాడుతూ ప్రతి వాహనం ను తనీఖీ చేస్తున్నామని, బయో డిజిల్ కుడా కాలుష్య నియంత్రణ కు ఇంధనం గా వినియోగం చేస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమల శాఖ ప్రోత్సాహక అధికారి సతీష్ మాట్లాడుతూ పరిశ్రమలు చుట్టూ స్టలము ఉన్నచోట మొక్కలను నాటుతున్నామని తెలిపారు. ప్రైవేట్ ఇండస్ట్రీస్ వారు పర్యావరణాన్ని క్కాపాడుటకు సొలార్ ఎనర్జీ ప్లాంట్ లను నిర్మిస్థున్నారని,అలాగే ఖాళీ స్ట లంలొ మొక్కలు నాటుటకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పర్యావరణ ప్రేమికుడు సురేశ్ గుప్తా మాట్లాడుతూ ప్రతి సోమవారం చేనేత వస్ట్రాలను వాడాలని , చిరు ధాన్యాలచే చేసే వస్తువులను వాడాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *