పేటలో ముక్కోటి వృక్షార్చన విజయవంతం – మొక్కలు నాటి ఉత్సాహాన్నిచ్చిన మంత్రి జగదీష్ రెడ్డి

  • పేటలో ముక్కోటి వృక్షార్చన విజయవంతం
  • మొక్కలు నాటి ఉత్సాహాన్నిచ్చిన మంత్రి జగదీష్ రెడ్డి
  • 5వ వార్డులో కన్నుల పండువగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

సూర్యాపేట, అక్షిత బ్యూరో: రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ముక్కోటి వృక్షర్చన పేటలో విజయవంతమైంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 5వ వార్డు లక్ష్మీనగర్ టౌన్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, పట్టణ ప్రథమ పౌరురాలు, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ తో కలసి మొక్కలు నాటి తండ్రికి తగ్గ తనయుడు మంత్రి కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన అన్ని వార్డుల ప్రజాప్రతినిధులు, అధికారులు నాయకులు, మెప్మా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ముక్కోటి వృక్షర్చన కార్యక్రమంలో దాదాపు ఐదు వేల మొక్కలు నాటారు. పెద్దఎత్తున ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి రాకతో అందరిలో ఉత్సాహం ఉప్పొంగింది. అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. గత సంవత్సరం ఇదే చోట మంత్రి జగదీష్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కౌన్సలర్ షేక్ బాషామియా ఏర్పాటు చేసిన జగదీశ్ రెడ్డి ప్రకృతివనం చిట్టడవిగా మారి పచ్చదనానికి చిరునామాగా నిలిచింది.కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని లక్ష్మీనగర్ టౌన్షిప్లొ నేడు ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతివనం కూడా అదే స్థాయిలో ఉండాలని మంత్రి జగదీష్ రెడ్డి అభిలాషించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి జగదీష్ రెడ్డి ఆశయ సాధనలో భాగంగా ఈ ప్రాంతాన్ని పచ్చగా మార్చేందుకు కృషిఎం చేస్తామని అక్కడకు వచ్చిన వారంతా ఏకధాటిగా చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రమంలో 5వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ షేక్ భాషా మియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిశోర్ , జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రామాంజుల రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *