పట్టణ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలి – బిజెపి జిల్లా కోశాధికారి యుగంధర్

అచ్చంపేట, అక్షిత న్యూస్: పట్టణంలో ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బిజేపి జిల్లా కోశాధికారి యుగంధర్ డిమాండ్ చేశారు. కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన యుగంధర్ ర్ శారు పట్టణంలో ఆదివారం బీజేపీ నిర్వహించిన కార్యవర్గ సమావేశానికి కి ముఖ్య అతిథిగా హాజరైన యుగంధర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, అం పట్టణాల్లో మాంసం, కూరగాయల మార్కెట్ కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి వదిలేశారని, వాటిని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని అన్ని కాలనీలలో అండర్ డ్రైనేజీ నిర్మాణాలు, సిసి రోడ్ల నిర్మాణాలు నిర్మించాలని, ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి టౌన్ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, అసెంబ్లీ కన్వీనర్ ఎం రేనయ్య, పట్టణ ఇన్చార్జి సైదులు యాదవ్, సీనియర్ నాయకులు మంగ్యా నాయక్ ,మండి కారి బాలాజీ, రామచంద్రయ్య పట్టణ కార్యదర్శి భరత్ ఆచారి రవీందర్, మైనార్టీ నాయకుడు హమీద్, సోషల్ మీడియా ఇన్ఛార్జి చందూలాల్, మధు, శివ చంద్ర ,రాజు, నిషాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *