అసంపూర్తి రహదారులు, భవనాలు పూర్తి చేయాలి

పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, అధికారులతో సమీక్ష

త్వరితగతిన పూర్తి చేయాలి

రమావత్ రవీందర్ రావు

దేవరకొండ, అక్షిత న్యూస్ : పెండింగ్ లో ఉన్న పంచాయితీరాజ్, ఆర్ అండ్ బీ పనులను పూర్తి చేయాలని దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పంచాయతీ రాజ్ ,ఆర్ అండ్ బి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పాల్గొని మాట్లాడుతూ అసంపూర్ణంగా ఉన్న బీటీ, సిసి రోడ్లు ,సి సి డ్రెన్లు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను పూర్తిచేయాలని ఆయన కోరారు నాణ్యతతో త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. పెండింగ్ పనుల పట్ల అధికారులు అలసత్వం వహించవద్దని అన్నారు. బీటీ రోడ్లు మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయమని అధికారులను కోరారు.ఈ సమీక్ష సమావేశంలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, శాఖ ఎస్సీలు నరసింహ ,ప్రకాష్, ఈ ఈ లు మాధవి , నరేందర్ రెడ్డి . డిఈలు లింగ రెడ్డి , జీవన్, భాస్కర్. ఏ ఈ బానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *