పేకాట రాయుళ్ల అరెస్ట్

పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు

సూర్యాపేట, అక్షిత ప్రతినిధి : ఇన్స్పెక్టర్ రాఘవరావు ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ గ్రాండ్ రెస్టారెంట్ నందు సిసిఎస్ పోలీసు తనిఖీ నిర్వహించారు.నమ్మదగిన సమాచారంపై సూర్యాపేట పట్టణంలోని బాలాజీ గ్రాండ్ హోటల్ నందు సీసీఎస్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. హొటల్ నందు ఒక రూమ్ లో నలుగురు వ్యక్తులు పేకాట అడుతుండగా వారిని అదుపులోకి తీసుకుని వారి నుండి 29 వేల నగదు, 4 సెల్ ఫోన్స్, 2 బైక్ లు స్వాధీనం చేసుకోవడం జరిగినది. వీరిని సూర్యాపేట పట్టణ పోలీసు స్టేషన్ నందు అప్పగించడం జరిగినది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాఘవరావు తెలిపారు. హోటల్, లాడ్జ్, రెస్టారెంట్ యజమానులు ఇలాంటి కార్యకలాపాలను ప్రోత్సహించవద్దని ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో సిసిఎస్ సిబ్బంది శ్రీను, నర్సింహారావు, రమేష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *