పాస్టర్ల కుటుంబాలకు ఆపన్న హస్తం

మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్*

సూర్యాపేట, అక్షిత బ్యూరో : స్థానిక తొమ్మిదో వార్డు ఎన్టీఆర్ కాలనీ లో క్రిస్టియన్ మైనారిటీ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యురాలు పి స్వరూప రాణి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సేవకుల కుటుంబాలకు ఆపన్న హస్తం అందించడం ప్రశంసనీయమని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని సూచిస్తారని ఆమేరకు స్వరూప రాణి సోదరి సహకారంతో పాస్టర్ జలగం డేవిడ్ రాజు అల్లుడు స్థానిక వార్డుకు చెందిన యాతాకుల మధు గత కొన్ని నెలలుగా బ్లాక్ ఫంగస్ వ్యాధి తో బాధపడుతూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే ఇదే స్థానిక తొమ్మిదవ వార్డుకి చెందిన పాస్టర్ స్టీఫెన్ పాల్ కి ఇటీవల కరోణ సోకడంతో మరణించారని, వారి కుటుంబాలకు చేయూత నివ్వడం అభినందనీయమని అన్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి ఇంకా దాతలు ముందుకు రావాలని ఆమె కోరారు. అనంతరం ఇరువురి కుటుంబాలకు 25 కిలోల బియ్యం తో పాటు నిత్యావసర సరుకులను మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్, పాస్టర్స్ ఫెలోషిప్ నియోజిక వర్గ, పట్టణ అధ్యక్షులు మీసాల గోవర్ధన్, మీసాల ప్రభుదాస్ చేతుల మీదుగా అందచేశారు. ఈ కార్యక్రమoలో మైనారిటీ నాయకులు పూర్ణ శశి కాంత్,ఉప్పుల మధు, కృష్ణ, గుండగాని నాగభూషణం, ఉదయ్ గౌడ్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *