పంతంగికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆశీస్సులు

జై గౌడ సంఘంలో చురుకైన పాత్ర పోషించనున్న పంతంగి

*సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వారోత్సవాల్లో మంత్రిచే ఆశీస్సులు……*

*రాష్ట్ర రాజధానిలో ఘనంగా ప్రారంభమైన పాపన్న జయంతి వారోత్సవాలు

సూర్యాపేట, అక్షిత ప్రతినిధి : సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 371వ, జయంతి వారోత్సవ వేడుకలకు రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్, క్రీడలు,యువజన సర్వీసులు,సాంసృతిక శాఖా మంత్రి వర్యులు విరసనోళ్ళ శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఆదివారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి పాపన్న గౌడ్ జీవిత చరిత్రను వివరించారు. రాజ్య పాలన వారసత్వంగా వస్తున్న నాటి రోజుల్లో బహుజనులపై,

జరుగుతున్న అరాచకాలను సాగిస్తున్న రుస్తుం అలీఖాన్ ఆగడాలను నిరశిస్తూ తిరుగుబాటు బావుటా ఎగుర వేసిన ధీశాలి, విప్లవ వీరుడు, తొలి తెలుగు చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ అని కొనియాడారు.కుల వృత్తులపై విధిస్తున్న పన్నులను నిరసిస్తున్న సమయంలో ప్రజలను ఏకతాటిపై తెచ్చి వారికి విముక్తి కలిగించిన ధైర్య సాహసి పాపన్న గౌడ్ అన్నారు. సామాజిక న్యాయంతో పాలన సాగిస్తూ, కేవలం గౌడ కులస్తులనే కాకుండా అన్ని కులాల హక్కుల కోసం, బహుజనుల విముక్తి కోసం పోరాడిన వ్యక్తి అన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టిన ఆయన చరిత్ర విదేశీ యూనివర్సిటీ పుస్తకాల్లో రూపొందించబడినట్లు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ గౌడ కులస్తుల అభివృద్ధికి పాటు పడుతున్నారని వెల్లడించారు. జానపద కళలకు ప్రాధాన్యత ఇచ్చినందున ఆయన చరిత్రను నేటికీ జానపద కథలతో ముడిపడి ఉందని చెప్పారు. జైగౌడ సంఘ జాతీయ అధ్యక్షులు డా.వట్టికూటి రామారావు గౌడ్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో గోవా, మహారాష్ట్ర,కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి గౌడ ప్రతినిధులు పాల్గొన్నారు.అనంతరం రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రిచే ఆయన ఆశీస్సులు పొందారు. వీరస్వామి గౌడ్ జైగౌడ సంఘంలో చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. తద్వారా వీరస్వామి గౌడ్ కి సంఘంలో మున్ముందు కీలకమైన పదవిలో కొనసాగనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *