పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకం

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో పంచాయతీ కార్యదర్శిల పాత్ర చాలా కీలకమైనది

-పాలేరు ఎమ్మెల్యే కందాళ

ఖమ్మం / అక్షిత బ్యూరో :

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో పంచాయతీ కార్యదర్శిల పాత్ర చాలా కీలకమైనదని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలోని రైతువేదిక నందు పాలేరు నియోజకవర్గంలోని 4 మండలాల ఎంపీడీఓ ఎంపీఓ పంచాయతీ కార్యదర్శిలతో సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామ పంచాయితీ కార్యధర్శిని పరిచయం చేసుకున్నారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే కందాళ మాట్లాడుతూ గ్రామాలలో మృతి చెందిన వారి వివరాలను వెంటనే తెలపాలని ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆసుపత్రికి వెళ్ళాలని ప్రవేట్ ఆసుపత్రులకి వెళ్లి డబ్బులు వృద్దా చేసుకోవద్దని మీ గ్రామాల ప్రజలకు తెలియజేయాలని సూచించారు. గ్రామాల్లో తాగు నీరు సమస్యలను రాకుండా చూడాలని చిన సన్న కారు రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన జేసీబీ ద్వారా దార్లను రోడ్డు మరమ్మత్తు పనులకు ఉపయోగించుకోవాలని ఎంపీడీఓ లకి తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *