పల్లెలు కొత్త శోభతో కనబడాలి

ప్రాధాన్యత అంశాలపై దృష్టి పెట్టండి

గ్రామాలలో విరివిగా మొక్కలు నాటాలి

నిర్లక్ష్యం పై చర్యలు తప్పవు

పల్లే ప్రగతిలో పలు పనులు తనిఖీ

జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి
సూర్యాపేట, అక్షిత బ్యూరో :
పల్లే ప్రగతి ద్వారా గ్రామాలలో చేపడుతున్న పనులతో కొత్త శోభ కనిపించాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సూర్యాపేట మండలం పిన్నాయపాలెం, సపావత్ తండ , యల్కారం గ్రామాలలో పల్లే ప్రకృతి కార్యక్రమంలో బాగంగా చేపట్టిన పలు పనులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లే, పట్టణ ప్రగతి కార్యక్రమాల వలన పట్టణ, గ్రామాలలో ఉన్నటువంటి పలు సమస్యలు పరిష్కారం అవుతున్నాయని గ్రామ, పట్టణాలలో కొత్త శోభ కనబడుతుందని అన్నారు. గ్రామాలలో ప్రాధాన్యత అంశాలపై గ్రామసభల ద్వారా ఆమోదం పొంది పనులు చేపట్టాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఇంటికి ఆరు మొక్కలను పంపిణీ చేసి నాటించి వాటికి సంరక్షించే భాధ్యత కుటుంబాలకు అప్పగించాలని మొక్కల యొక్క అవశ్యకత పై అవగాహన కల్పించాలని అన్నారు. ముఖ్యంగా పల్లే ప్రగతిలో ప్రజలు, ప్రజా ప్రతినిధులను భాగస్వాములు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలలో హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సపావాత్ తండ లో వైకుంఠ దామంను పరిశీలించి మిగిలిఉన్న పనులను పది లోపు పూర్తిచేయాలని సూచించారు. యల్కారం గ్రామంలో ప్రజాప్రతినిధులతో కలసి మొక్కలు నాటారు. అలాగే గ్రామాలలో నర్సరీలను, పల్లే ప్రకృతి వనాలను, వైకుంఠ థామాలు, గ్రామ పంచాయతీ వార్డులను పరిశీలించి ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులను చేపట్టాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యంగా పల్లే ప్రగతిలో గ్రామాలలో పారిశుధ్యం, మౌలిక సదుపాయాలు, హరిత హారం, విద్యుత్ సమస్యలు అలాగే ప్రజలను భాగస్వాములు చేసి పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఎంపీపీ రవీంద్ర రెడ్డి, జెడ్పీటీసీ జీడి బిక్షం, ఎంపిడిఓ శ్రీనివాసరావు,సర్పంచులు ch. మౌనిక మధు, లాలూ నాయక్, ఎంపీటీసీ ఉప్పల లక్ష్మమ్మ సైదులు,కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *