పల్లె ప్రగతితో పల్లెల అభివృద్ది

*కోమటికుంటలో పల్లె ప్రగతి

లింగాల, అక్షిత న్యూస్ :

లింగాల మండలం కోమటికుంట గ్రామంలో జరిగిన హరితహారం బయో పెన్షన్ మొక్కలు నాటడం
పాత బావులను మూసివేయడం గ్రామంలో చెత్త కుప్పలను ఎత్తివేయడం విద్యుత్ నీటి సమస్యలు పరిష్కరించడం గ్రామంలో పలు పనులన్నీ పరిశీలించడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామ సభలో ఎంపీడీవో గీతాంజలి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సందేశం ఇచ్చింది. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరు ఇంటింటికి మొక్కలు నాటి కాలుష్యాన్ని తగ్గించాలని చెప్పారు గ్రామ అభివృద్ధికి అందరూ కలిసి రావాలని కోరారు. గ్రామ సభలో పాల్గొన్న వారు ఎంపీడీవో గీతాంజలి, గ్రామ సర్పంచ్ గుడి బచ్చన,టీ ఏ నరేష్, ఉప సర్పంచ్,వార్డు సభ్యులు గ్రామ కార్యదర్శి చిన్నబాబు అంగన్వాడీ టీచర్స్ మహిళా సంఘం అధ్యక్షులు మండల యూత్ అధ్యక్షులు గుడి శ్రీనివాసులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *