అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు

పాలకీడు, అక్షిత న్యూస్: మండలంలోని బొత్తలపాలెం లోని అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో పోషన్ అభియాన్ లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ జానకమ్మ ప్రేమ లత మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలని వారు తెలిపారు ఆకుకూరలు పాలు గుడ్లు తదితర పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు పోషణ అభియాన్ లో భాగంగా ఎత్తుకు తగ్గ బరువు దెబ్బ కొలతలు మరియు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు ఉండే పదార్థాలు తీసుకోవాలని వారు కోరారు మా అంగన్వాడీ కేంద్రాల ద్వారా మా సూచనల మేరకు మా గ్రామంలో ఉన్న గర్భిణీలు పోషకాహారంతో కూడిన ఈ పదార్థాలు తినడం వల్ల ఎలాంటి ఆపరేషన్ లేకుండా 20 మంది గర్భిణీలలో 13 మంది ఫ్రీ డెలివరీ అయ్యారని కావున పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉంటామని అదేవిధంగా కరోనా నేపథ్యంలో కేంద్రాలకు వచ్చేవారు గర్భిణులు బాలింతలు పిల్లలు మాస్కు ధరించి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ ఉపాధ్యాయులు మధు భరణి నాగరాణి ఆయా ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *