OU students will support to mahakutami

కూటమి కడుతున్న ఉస్మానియా విద్యార్దులు

తెలంగాణలో జరగనున్న ముందస్తు ఎన్నికలలో విద్యార్దులు, యువకులు, ఎటువైపు ఉంటారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. రాష్ట్రం విడిపోవాడానికి ముందు తెలంగాణ విద్యార్దులు, యువకులు తెరాస వైపు ఉన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంథీయే అయిన దాని కోసం పోరాడి తీసుకు వచ్చింది మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి అని భావించారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ధ్యేయంగా ఉద్యమించిన తెలంగాణ విద్యార్ది లోకం, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు మద్దుతు పలికారు.

అంతే కాకుండా తెరాసాకు పట్టం కట్టేలా తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేసారు. మన పాలన మనమే చేసుకోవాంటూ నినదించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలన్నీ తెరాసా జిందాబాద్ అన్నాయి. ముఖ్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం అయితే తెలంగాణ రాష్ట్ర సమితికి, కె. చంద్రశేఖర రావుకు ప్రాణం పెట్టింది. ఉస్మానియాలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్ది తెలంగాణలోని గ్రామాలకు తరలి వెళ్లారు. వారి ఓట్లే కాకుండా కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఓట్లు కూడా తెరాసాకు పడేలా చేసారు. వారి ప్రభావంతో రాజకీయ పరిజ్నానం లేనివారు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచారు.

నాలుగేళ్ల కల్వకుంట్ల వారి పాలన విద్యార్దులకు నచ్చలేదట. సొంత రాష్ట్రం ఏర్పాడ గానే లక్షలాది ఉద్యోగాలు ఆశించిన యువత భంగపడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినదించడం ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా పనిచేయాలని విద్యార్ది సంఘాల నాయకులు తీర్మనించినట్లు సమాచారం. తనను కలిసేందుకు వచ్చిన విద్యార్ది నాయకులకు ముఖ్యమంత్రి అపయెంటుమెంటు కూడా ఇవ్వలేదని వారు ఆగ్రహంతో ున్న సమాచారం. అలాగే ముఖ్యమంత్రి గాని, మంత్రుల గాని ఉస్మానియాలకు వచ్చిన దాఖాలాలు లేవంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లగలరా అంటూ ముఖ్యమంత్రికి సవాల్ కూడా విసిరారు. ఈ నేపధ్యంలో మహాకూటమిగా ఏర్పడుతున్న పార్టీలకు, ముఖ్యంగా కోదండరామ్‌కు బాసటగా నిలవాలని విద్యార్ది సంఘాల నాయకులు నిర్ణయించినట్లు సమాచారం.
Tags: OU Students ,Telangana TRS, Mahakutami, Congress Telangana Students

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *