నర్సింహగౌడ్ కు బాల్య మిత్రుల సత్కారం

అచ్చంపేట, అక్షిత న్యూస్ :
అచ్చంపేట పట్టణ పురపాలక చైర్మన్ గా ఎన్నికైన ఎడ్ల నరసింహ గౌడ్ ను 1990 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన క్లాస్మేట్స్ మిత్రులకు ఆదివారం పురపాలక కార్యాలయంలో కలసి చైర్మన్ నరసింహ గౌడ్ ను పూలమాలలతో శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా చిన్ననాటి మిత్రుడు నరసింహ గౌడ్ తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులతో కలిసి అనేక పోరాటాలు చేసి రాజకీయంగా అంచెలంచెలుగా ఎదుగుతూ పురపాలక చైర్మన్ స్థాయికి ఎదగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా నాడు విద్యా బోధన చేసిన గురువులు జగల్ రెడ్డి సుధాకరయ్యలు చైర్మన్ గా ఎన్నికైన నరసింహ గౌడ్ ను శాలువాతో సత్కరించారు. అనంతరం చైర్మన్ నరసింహ గౌడ్ మాట్లాడుతూ ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు అని నా చిన్ననాటి స్నేహితులు అదేవిధంగా చదువు నేర్పిన గురువులు నన్ను సన్మానించి ఆశీర్వదించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్ తిరుపతయ్య, వెంకటస్వామి, వెంకట్రావు హనుమంతు పుల్లయ్య సీతారాం రెడ్డి శివయ్య తిరుపతి, పాండురంగారావు, సతీష్, శ్రీను, వినోద్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *