నల్లమలలో మహిళ కిడ్నాప్ కలకలం

అచ్చంపేట, అక్షిత న్యూస్ :
నల్లమల అటవీ ప్రాంతమైన అమ్రాబాద్ మండలంలోని మన్నూరు గ్రామంలో మంగళవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో మహిళ కిడ్నాప్ కలకలం రేపింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఆటో లో గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు మహిళను కిడ్నాప్ చేసి e గ్రామ సమీపంలోని పురుగుల గుట్ట వైపు వెళుతుండగా మహిళ కేకలు వేయడంతో గ్రామంలోని అంబేద్కర్కాలనీకి చెందిన మహిళ గుర్తించి కాలనీవాసులకు తెలపగా కాలనీవాసులు స్థానిక విలేకరుల సహాయంతో అమ్రాబాద్ సిఐ బిసన్నకు తెలిపారు. విషయం తెలుసుకున్న సిఐ హుటాహుటిన మన్ననూర్ చేరుకుని పోలీసులతో గ్రామ యువకులు 30 మందితో కలిసి తిరుమల గుట్ట పరిసరాల్లో అడవిలో మహిళ కోసం గాలిస్తున్నారు. చీకట్లో సెల్ ఫోన్ లైట్ వెలుతురులో మహిళ కోసం గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *