ముందుచూపుతో “ముందడుగు” ఉండాలి

సంగారెడ్డి జిల్లా జైలు సూపరిండెంటెంట్ శివకుమార్

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

ప్రజల్లో, యువతలో ఆలోచన రేకెత్తించే కార్యక్రమాలతో ముందడుగు వేయాలని, అప్పుడు బాధ్యతగల వ్యక్తులుగా పనిచేసినవారవుతారని సంగారెడ్డి జిల్లా జైలు సూపరిండెంటెంట్ శివకుమార్ గౌడ్ అన్నారు. సోమవారం యూత్ ఫర్ యాంటీ కరప్షన్ కేంద్ర కార్యాలయంలో ముందడుగు ఏలా పనిచేయాలి, దాని పని విధానం ఏలా ఉండాలనే విషయాలపై తగు సలహలు, సూచనలు అందించారు. సమస్యలపై స్పందించే కొంతమంది యువత ఆలోచనలతో ఒక సంస్థగా ఏర్పడి సమాజంలో మార్పుకోసం శాంతియుతంగా ముందుకు నడవడం మంచి పరిణామమన్నారు. అవినీతి నిర్మూలనపై చైతన్యం చేయడమే కాకుండా విపత్కాల పరిస్థితుల్లో అండగా ఉంటూ ఎంతోమందికి సహయంగా నిలుస్తున్నారని అన్నారు. ఒక వినూత్న మార్పుకోసం, కొత్త తరహా ఆలోచనలతో ముందడుగుతో నీతి, నిజాయితీపరులను గుర్తించడం, అవినీతి ప్రశ్నించేలా ఆలోచన రెకెత్తించే కార్యక్రమాలకు పునాది వేయడం ఒక మార్పుకు ప్రధాన సంకేతమన్నారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి మాట్లాడుతూ ముందడుగు ద్వారా సమస్యను గుర్తించి దానికి శాంతియుతంగా పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నిజాయితీకి పనిచేసిన, పనిచేస్తున్న వారితో వినూత్న కార్యక్రమాలకు బీజం వేస్తూ, ప్రజల్లో ఆలోచన రెకెత్తిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కొమటి రమేశ్ బాబు, జి. జయరాం, కె. దేవేందర్, సారా, మారియా అంతోని, మూడావత్ రమేష్ నాయక్, ప్రవీణ్, మణిదీప్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *