మంద కృష్ణను పరామర్శించిన గద్దర్

మంద కృష్ణను
పరామర్శించిన గద్దర్

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి : న్యూఢిల్లీలో కాలికి గాయమై శస్త్ర చికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న ఎంఆర్ పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను గద్దర్ పరామర్శించారు. శస్త్ర చికిత్స అనంతరం హైదరాబాద్ లోని డిడి కాలనీలోని ఆయన నివాసంలో పలువురు నేతలు, ప్రజాస్వామిక వాదులు పరామర్శించారు. త్వరలోనే కోలుకుని మళ్ళీ ప్రజా బాహుళ్యoలోకి రావాలని ఆకాంక్షించారు. టిజేఎస్అధినేత కోదండరామ్, గద్దర్ తో పాటు నల్గొండ గద్దర్ గా పేరొందిన నర్సిరెడ్డి, కాంగ్రెస్ నేతలు సాకే శైలజానాథ్, దాసోజు శ్రవణ్, మాజీ ఎం ఎల్ సి రాములు నాయక్,ఎంఆర్ పిఎస్, ఎంఎస్ పి, ఎంజేఎఫ్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేర్వేరుగా వచ్చి కృష్ణ మాదిగను కలిసి పరామర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *