అధునాతన దంత వైద్య సేవలు

మెరుగైన వైద్య సేవలు అందించాలి
శేఖర్ దంత వైద్యశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ఆకాంక్షించారు. స్థానిక ఆర్టీసీ బస్సు ప్రాంగణం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శేఖర్ దంత వైద్యశాలను ఆయన ప్రారంభించారు. మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు వైద్య సేవల కోసం జిల్లా కేంద్రాలకు, హైదరాబాద్ తదితర నగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఆస్పత్రులు, రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలకు ఏర్పాటు చేస్తున్న వైద్యులను అభినందిస్తున్నట్టు భాస్కర్ రావు తెలిపారు.అయితే, వైద్య సేవల కోసం ఆస్పత్రి మెట్లెక్కే రోగుల్లో ఫీజులు చెల్లించుకోలేని వారి పట్ల సహృద్భావంతో మెలగాలని డాక్టర్లను కోరారు. సేవా దృక్పథంతో వైద్య సేవలందించి సహకరించాలని భాస్కర్ రావు ఆకాంక్షించారు. అనంతరం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన అధునాతన డెంటల్ ఉపకరణాలను, ఎక్స్ రే, తదితర మెషీన్లను ఆయన పరిశీలించారు. ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహా రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిట్టి బాబు నాయక్, జడ్పీటీసీ అంగోతు హాతిరామ్ నాయక్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *