మిర్యాలగూడ అభివృద్దే ధ్యేయం

మిర్యాలగూడ పురపాలికను ఆదర్శ మున్సిపాలిటీల జాబితాలో నిలపాలి

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సీడీఎఫ్ నిధులను రూ.3కోట్ల నుంచి రూ.5కోట్లకు పెంచిన సర్కార్

3వ వార్డులో మురుగునీటి కాలువ నిర్మాణం పనులకు శంకుస్థాపన

పెండింగ్ సీసీ రోడ్ల నిర్మాణం పనులను వెంటనే పూర్తి చేయాలి

నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ఎల్లవేళలా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు. నియోజవర్గంలో చేపట్టాల్సిన పనులను ఎప్పటికప్పుడూ బేరీజు వేసుకొని ముందుకు వెళ్తుంటారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఎక్కడయినా అసంపూర్తి పనులను గుర్తించినట్టయితే క్షణం ఆలస్యం చేయకుండా సంబంధిత అధికారులకు,ప్రజాప్రతినిధులకు ఫోన్ చేసి అలర్ట్ చేస్తారు. పనులు పెండింగ్ లో ఉండటానికి గల కారణాలను తెలుసుకొని అవసరమైతే అదనంగా నిధులను మంజూరు చేయించి తన తదుపరి పర్యటన లోపు అసంపూర్తి పనులు పూర్తయ్యేలా చూసుకుంటారు. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి (సీడీఎఫ్ )నిధులను పూర్తి స్థాయిలో నియోజకవర్గానికి ఉపయోగిస్తూ భాస్కర్ రావు తన మార్క్ సుపరిపాలనను అందిస్తున్నారు. కరోనా కష్టకాలంలో సీడీఎఫ్ నిధుల మంజూరుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా బ్రేక్ వేసింది. ఇటీవల మళ్లీ నిధుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో రూ.3 కోట్లు అందజేసిన సర్కారు తాజాగా సీడీఎఫ్ నిధులను రూ.5 లక్షలకు పెంచింది. క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు పర్యటించినప్పుడు ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను స్వీకరించి ప్రభుత్వ అనుమతి లేకుండానే అప్పటికప్పుడు సీడీఎఫ్ నిధులను కేటాయించే అధికారం శాసనసభ్యులకు ఉంటుంది. 2020-21 రాష్ట్ర ఆర్ధిక బడ్జెట్ లో సీడీఎఫ్ నిధుల కోసం ప్రభుత్వం రూ.800 కోట్లు కేటాయించింది. ఈమేరకు ముఖ్య ప్రణాళికా అధికారికి (సీపీవో) కు కూడా బడ్జెట్ నిధుల కేటాయింపునకు సంబంధించి ఆదేశాలు అందాయి. క్యూసీ రిపోర్ట్ ఆధారంగా నిధులు అందుతాయి. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల కారణంగా నిలిచిపోయిన సీడీఎఫ్ నిధులను ప్రభుత్వం మళ్లీ పునరుద్ధరించడంతో పాటు దీని మొత్తాన్ని పెంచడంతో మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి వేగాన్ని భాస్కర్ రావు పెంచారు. అన్ని వార్డుల ప్రజల నుంచి, కౌన్సిలర్ల నుంచి వస్తున్న వినతులను స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు పరిష్కకరిస్తూ పారదర్శక పాలనకు పీఠం వేసి ముందుకెళ్తున్నారు.మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా విశిష్టకృషిచేస్తున్నట్లు మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ఉద్ఘాటించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. 3వ వార్డు తాళ్లగడ్డలో రూ.20 లక్షల నిధులతో మురుగునీటి కాలువ నిర్మాణం పనులకు భాస్కర్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం వార్డులో సీసీ రోడ్ల నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న అన్ని పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వానాకాలం నేపథ్యంలో వరదనీరు నిలువ ఉండకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో మురుగుకాలువలను ఎప్పటికప్పుడూ మున్సిపల్ సిబ్బంది శుభ్రపరిచే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అపరిశుభ్రత కారణంగా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని…వార్డు కౌన్సిలర్లు ఎప్పటికప్పుడు వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసమస్యలపై తక్షణమే స్పందించాలని భాస్కర్ రావు ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధికి సరిపడ నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తోందని నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలకు నిధిగా కోటి రూపాయలను గత ప్రభుత్వాలు ఖర్చు చేసేవని, వీటి ఖర్చు విషయంలో సవాలక్ష ఆంక్షలు, నిబంధనలుండేవని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గాల అభివృద్ధి కోసం రూ.3కోట్లు నిధులు మంజూరయ్యేవని అన్నారు. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గానూ సీడీఎఫ్ నిధులను రూ.3 కోట్ల నుంచి రూ.5కోట్లకు పెంచుతూ రాష్ట్ర ఆర్ధికశాఖ జీవోనెంబర్ 13 జారీ చేసిందని భాస్కర్ రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుంటూ మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని అన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో రూ.18కోట్ల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం పనులను చేపడుతున్నట్టు తెలిపారు. అంతేకాకుండా, 15వ ఆర్ధిక సంఘం నుంచి మంజూరైన రూ.2కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీ నిర్మాణ పనులను వేగవంతం చేసినట్టు చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో 7వేల ఎల్ఈడీ వీధి దీపాలను అమర్చేందుకు నిధులు మంజూరు చేయించినట్టు తెలిపారు. కరోనా కష్టకంలోనూ ప్రతినెలా గ్రామాల అభివృద్ధి కోసం రూ.339 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.148 కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయని కొనియాడారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామని భాస్కర్ రావు అన్నారు. మిర్యాలగూడ పురపాలికను ఆదర్శ మున్సిపాలిటీల జాబితాలో చేర్చేందుకు పట్టణ ప్రజలు సహకరించాలని, అధికారులు నిబద్ధతతో పనిచేయాలని ఎమ్మెల్యే భాస్కర్ రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు,మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న, మున్సిపల్ డీఈఈ సాయిలక్ష్మీ, కౌన్సిలర్లు బాసాని గిరి, బంటు రమేష్, లక్ష్మీనారాయణ, మెరుగు సంజయ్, టీఆర్ఎస్వీ కార్యదర్శి షోయబ్, పెద్ది శ్రీనివాస్ గౌడ్, నాగులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *