మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

మరిపెడ అక్షిత ప్రతినిధి : మరిపెడ మున్సిపాలిటీ లోని వినాయక చవితి సందర్భంగా మరిపెడ మున్సిపల్ కమిషనర్ గణేష్ బాబు ఆధ్వర్యంలో మరిపెడ పట్టణ కేంద్రంలోని మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పర్యావరణ హితమైన మట్టి గణపతులను పంపిణీ చేయడం జరుగుతుందని, మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు ఈ అవకాశమును వినియోగించుకుని మట్టి విగ్రహాలు తీసుకొని పోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ మురళి, హెల్త్ ఇన్స్పెక్టర్ వీరన్న, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *