మరియమ్మ కుటుంబానికి చేయూత

కుమారుడికి రూ.15 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం,ఇద్దరు కుమార్తెలకు ఒక్కొకరికీ రూ.10 లక్షల పంపిణీ

ఖమ్మం, అక్షిత బ్యూరో : ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామంకు చెందిన దళిత మహిళ అంబడిపూడి మరియమ్మ కుటుంబాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం పరామర్శించారు. వారి కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. అనంతరం మరియమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మరియమ్మ మృతి అత్యంత బాధాకరమని, ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సంఘటనలో మరణించిన మరియమ్మ కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయం చేశారని పేర్కొన్నారు. కుమారుడు ఉదయ్ కిరణ్ కి రూ.15 లక్షల చెక్కు, ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వులను వారికి కుటుంబానికి స్వయంగా అందజేశారు. ఇద్దరు కుమార్తెలకు ప్రభుత్వం తరఫున ఒక్కొకరికీ రూ.10 లక్షలు మొత్తం రూ. 35 లక్షల నగదు, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *