సమగ్రాభివృద్దే ధ్యేయంగా పనిచేద్దాం

వేములపల్లి మండలాన్ని అభివృద్ధి చేద్దాం
నల్లగొండ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి

వేములపల్లి, అక్షిత ప్రతినిధి : పార్టీలు,రాజకీయాలకు అతీతంగా మండల సమగ్రాభివృద్ధి సాధించేందుకు వేములపల్లి మండల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం వేములపల్లి మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపీపీ పుట్టల సునీత కృపయ్య అధ్యక్షత వహించగా జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.కరోనా కారణంగా పాఠశాలలు మూసివేసి ఆన్ లైన్ విధానంతో విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారని, పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఆన్ లైన్ పాఠాలు చదివేందుకు సెల్ ఫోన్ లేక ఉన్నవారికి అర్థం కాకపోవడంతో విద్యార్థులు చదువులో వెనుకబడి పోవడం చూసి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలను పునర్ ప్రారంభించాలని మండల సభ ఏకగ్రీవంగా ఆమోదించడం పట్ల తను ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. మండలంలో ప్రభుత్వపాఠశాలలో విద్యానభ్యసించే బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఆహార భద్రత కార్డులు అందించి రేషన్ షాపులకు సన్నబియ్యం తోపాటు గత ప్రభుత్వం అందించిన విధంగా నిత్యావసర సరుకులనుపంపిణీ చేయాలని కోరారు. అభయహస్తం పథకంలో భాగంగా మహిళలనుండి సేకరించిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని మహిళసంఘాలకు రావాల్సిన వడ్డీలేని రుణాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో వైస్ ఎంపీపీ పాదూరి గోవర్ధనిశశిధర్ రెడ్డి,తహశీల్దార్ వెంకటేశం, ఎంపిడిఓ బత్తుల వెంకటేశ్వర్లు, ఎంపిటిసిలు చలబట్ల చైతన్య ,పల్లా వీరయ్య, మండల విద్యాధికారి బాలాజీ నాయక్, వైద్యాధికారి డాక్టర్ ముస్తాక్ అహమ్మద్, వ్యవసాయ అధికారి ఋషిన్ద్ర మణి, పశువైద్యాధికారి మిర్యాల.సంపత్ కుమార్, ఏఈలు ఆదినారాయణ, ముజీబ్,చిన్ని,వెంకట్ రెడ్డి, ఏపీవో శ్రీనివాస్ రెడ్డి, ఎపిఎం అనూక్, ఐసిడిఎస్ సూపర్ వైజర్ రాజరాజేశ్వరి, పిఎసిఎస్ సీఈవో రవీందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

*మండలసభకు హాజరుకాని అధికార పార్టీ సభ్యులు*
మంగళవారం వేములపల్లి మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ పుట్టల సునీత అధ్యక్షత జరిగిన జనరల్ బాడీ సమావేశంలో పాల్గొనేందుకు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారనే సమాచారం అందుకున్న అధికార టిఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపిటిసిలు మండలంలోని 11గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచులు సమావేశానికి హాజరు కాకుండా దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఎంపీపీ, వైస్ఎంపీపీతోపాటు శెట్టిపాలెం, వేములపల్లి ఎంపిటిసిలు, అమనగల్లు సర్పంచ్ వలంపట్ల ఝాన్సీ ప్రవీణ్ కుమార్ మాత్రమే సమావేశంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *