మంద కృష్ణ మాదిగను పరామర్శించిన డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి : ప్రమాదవశాత్తు కాలికి గాయమై సర్జరీ చేయించుకున్న ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. మంగళవారం విద్యానగర్ లోని ఆయన నివాసంలో కలిసి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తరతరాలుగా అణచివేత, దోపిడి, వివక్ష, నిరాదరణకు గురైన వర్గాల ఆత్మగౌరవం కోసం ,అన్నింటా న్యాయమైన వాటా కోసం కృష్ణన్న నడుపుతున్న పోరాటం మాటల్లో వర్ణించలేనిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *