ఎల్ ఆర్ ఎస్ పై తొలగని సందిగ్ధం

ఎల్ఆర్ఎస్ పై స్పష్టత ఇవ్వండి

*పట్టా పాస్ బుక్ నుంచి పాత వెంచర్ల రిజిస్ట్రేషన్ కొరకు ఎదురు చూస్తున్న ప్రజలు*

రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘo జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్

సూర్యాపేట, అక్షిత బ్యూరో :

ఎల్ఆర్ఎస్ పై టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని రియల్ ఎస్టేట్ వ్యాపార సంఘo సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం జిల్లా కేంద్రం నుండి ఒక ఈ ప్రకటన విడుదల చేశారు.పాత వెంచర్లపై ప్రభుత్వం పది వేల రూపాయలు మీ సేవ ద్వారా ఎల్ఆర్ఎస్ కొరకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి కట్టించుకొన్న ప్రభుత్వం నేటికీ దానిపై స్పష్టత ఇవ్వలేదన్నారు. పట్టా పాస్ బుక్ పై ఒక ఎకరం లోపు ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేసే విధంగా ప్రభుత్వం జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. పేదలు వారి కుటుంబ అవసరాల నిమిత్తం,కూతుళ్ళ పెళ్లిళ్ల కోసం ఒక్కొక్క రూపాయి వెనకేసుకొని చిన్నపాటి భూములను కొనుగోలు చేశారన్నారని,అట్టి భూములపై కూడా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసేందుకు వెనకాడితే పేదలు మరింత ఆర్ధిక కూబిలోకి వెళ్లే ఆస్కారం ఉందన్నారు. ఒక ఎకరం పైబడిన భూములపై కన్వర్షన్ మీద రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పారు. భూముల కొనుగోలుపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి నేడు దీన స్థితికి దిగజారారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయేతర భూమిని తమ అవసరాల కోసం అమ్మజూపితే విభజించే అవకాశం లేకుండా ప్రభుత్వం జీవో తేవడం సరికాదన్నారు.దానిని కూడా పునరాలోచించి యజమనూలు తమకి అవసరం ఉన్నంత వరకే అమ్ముకునే వెసలుబాటు గతంలో ఉన్నట్లే కల్పించాలని కోరారు. ప్రభుత్వం వీటిపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే కొందరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో కూడా ఉన్నారన్నారు. లేనిచో గతంలో మీ సేవలో ఎల్ఆర్ఎస్ కొరకు కట్టిన ఫీజుపై ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసే విధంగా జిఓ జారీ చేయాలని కోరారు.దీనిపై ముఖ్యమంత్రి కేసిఆర్ పునరాలోచించి మరో నూతన జీఓని విడుదల చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *