లెక్చరర్ శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర రత్న అవార్డు

మురిసిన పల్లె
– రాంరెడ్డిపల్లి గ్రామస్తుల హర్షం

తెలకపల్లి ,అక్షిత న్యూస్ : మండల పరిధిలోని రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కడుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర రత్న అవార్డు పొందడంపై ఆదివారం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అందుల ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి గత 21 సంవత్సరాలుగా అంధ విద్యార్థులకు బోధనతో పాటు శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు పలు పుస్తకాలను హైదరాబాదులోని నీల్ కమల్ పబ్లికేషన్ సహాయంతో రూపొందించారు. వీరి సేవలను గుర్తించిన వి ఎన్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ వారు శనివారం (జూలై 31న) రాత్రి తెలంగాణ సరస్వతి పరిషత్ హైదరాబాద్ నందు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి సముద్రాల వేణుగోపాల చారి న్యూఢిల్లీ చేతుల మీదుగా శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర రత్న అవార్డును అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రముఖులు వి ఎన్ ఆర్ సంస్థ చైర్మన్ డాక్టర్ నవీన్, బూరుగుల మధుసూదన్ సుంకర సత్యనారాయణ డాక్టర్ ఎల్ పనికుమార్ పిఎల్ శ్రీనివాస్ డాక్టర్ కోయి కోటేశ్వరరావు తదితర ప్రముఖులు పాల్గొన్నట్లు వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *