చట్టం పరిధిలోనే లేఅవుట్ అనుమతులు ఇవ్వాలి

రాష్ట్ర పురపాలక, పట్టణ అభివృద్ది ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
నూతన పురపాలక చట్టం ననుసరించి పట్టణ స్థానిక సంస్థల పరిధిలో లే అవుట్ అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర పురపాలన, పట్టణ అభివృద్ధి ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ జిల్లా కలెక్టర్ లను,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లను ఆదేశించారు.గురువారం హైద్రాబాద్ నుండి నల్గొండ, సూర్యాపేట,యాదాద్రి భువనగిరి, జనగాం, ఖమ్మం జిల్లాల కలెక్టర్ లు,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లు,మున్సిపల్ కమిషనర్ లు,పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించి లేఅవుట్ ల అనుమతులు, భవన నిర్మాణ అనుమతులు,పట్టణ ప్రగతి, హరిత హారం తదితర అంశాలపై సూచనలు చేశారు.జులై 2019 నుండి నూతన మున్సిపల్ చట్టం నిబంధనలు ప్రకారం టి.ఎస్.బి పాస్ ద్వారా ఆన్లైన్ లో వచ్చిన లేఅవుట్ లు,పట్టణ ప్రణాళిక విభాగం టెక్నికల్ పరిశీలన తర్వాత జిల్లా కలెక్టర్ ఆద్వర్యం లో టాస్క్ ఫోర్స్ కమిటీ అనుముతులు జారీ చేయాలని అన్నారు.లే అవుట్ ఖాళీ స్థలం మున్సిపాలిటీ,జి.పి.లు తమ పేరున రిజిస్టర్ చేసి ఆ స్తలం లో మొక్కలు నాటి పరిరక్షించాలని అన్నారు.10 ఎకరాల వరకు టెక్నికల్ స్క్రీనింగ్ తర్వాత జిల్లా స్థాయి కమిటీ,10 ఏకరాలు దాటితే డి.టి.సి.పి ద్వారా లే అవుట్ అనుమతులు నిర్ణీత సమయంలో మంజూరు చేయాలని అన్నారు.లే అవుట్ లను ఆడిట్ నిర్వహించాలని అన్నారు. 10 శాతం లే అవుట్ స్థలం లో ఓపెన్ స్థలం సంబంధిత స్థానిక సంస్థల పేరున రిజిస్టర్ కావాలని అన్నారు.జులై 2019 తర్వాత,ముందు లే అవుట్ లు అనుమతులు ఎన్ని ఇచ్చారు రికార్డు నిర్వహణ చేయాలని అన్నారు.భవన నిర్మాణ అనుమతులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలను కూల్చి వేయాలని అన్నారు.పట్టణ ప్రణాళిక అధికారులు,సిబ్బంది లే అవుట్ లు అనుమతులు,భవన నిర్మాణ అనుమతుల్లో నిర్లక్ష్యం వహించినా,అక్రమాలకు పాల్పడినా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.లే అవుట్ లు,భవన నిర్మాణం ల పై క్షేత్ర స్థాయిలో పరిశీలన, తనిఖీ లు నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లను ఆదేశించారు.అనుమతులు లేని లే అవుట్ లు రిజిస్ట్రేషన్ చేయకుండా సర్వే నంబర్ లతో సబ్ రిజిస్ట్రార్ లకు లేఖ రాయాలని ఆయన సూచించారు.పట్టణాలలో రహదారుల సెంట్రల్ మీడియన్,రోడ్డు మార్జిన్ లలో ఆవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని,పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, జూనియర్ కళాశాలలు, ఆస్పత్రులలో సంబంధిత స్థానిక సంస్థల ద్వారా పరిశుభ్రం చేయాలని అన్నారు. పట్టణంలో ఎక్కడా మొక్కలు లేకుండా ఖాళీ స్థలం ఉండరాదని అన్నారు.చెత్త సేకరణ ప్రతి రోజు చేసి మున్సిపాలిటీ కొనుగోలు చేసిన వాహనాల ద్వారా డంప్ యార్డ్ తరలించాలని అన్నారు.ప్రతి మున్సిపాలిటీ లో డి.ఆర్.సి.,ఎఫ్. ఎస్.టి.పి(మురుగు నీటి శుద్దీకరణ ప్లాంట్)లు ఏర్పాటుకు స్తలం గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. వెజ్, నాన్ వెజ్ మార్కెట్ లను పట్టణం నుండి దూరం కాకుండా పట్టణంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.వైకుంఠ దామం లలో ప్రహరీ గోడ, పరిశుభ్రత,స్థానపు గదులు, బర్నింగ్ ప్లాట్ పామ్ లు కనీస వసతులు కల్పించాలని అన్నారు.నీరు నిలిచే లోతట్టు ప్రాంతాలు పై దృష్టి సారించాలని అన్నారు. ఈ వి. సి.లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ అపూర్వ్ చౌహన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *