శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలి

ప్రతి పౌరుడు యూనిఫామ్ వేసుకొని పోలీసే..
టూ టౌన్ సిఐ నిగిడాల సురేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర హెల్పింగ్ హ్యాండ్ అధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

శాంతి భద్రత పరిరక్షణకు పట్టణ ప్రజలు సహకరించాలని మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్ పెక్టర్ నిగిడాల సురేష్ కోరారు. టూ టౌన్ సీఐగా నూతనంగా బాధ్యతలను చేపట్టిన నిగిడాల సురేష్ ను తెలంగాణ రాష్ట్ర హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ పీఎస్ లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వైద్య, సామాజిక సేవలో విస్తృత సేవలందిస్తున్న డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ గతవారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి.పార్థసారథి చేతుల మీదుగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారాన్ని అందుకున్నారు. ఈనేపథ్యంలో తనను కలిసిన మునీర్ ను అభినందిస్తున్నట్టు సీఐ నిగిడాల సురేష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ సమాజసేవ కోసం కొంత సమయాన్ని కేటాయించాలని కోరారు. ప్రతి పౌరుడూ నేరాలను అదుపు చేయడంలో, అరికట్టడంలో, ఛేదించడంలో పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రతి పౌరుడూ యూనిఫామ్ వేసుకొని పోలీసేనని సీఐ అభిప్రాయపడ్డారు. అనంతరం డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ హెల్పింగ్ హ్యాండ్స్ బృందంతో కలిసి సీఐ నిగిడాల సురేష్ కు పుష్ప గుచ్ఛం అందజేసి, డైరీ, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ సుదర్శన్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ దయాకర్ రెడ్డి, హఫీజ్,యాదగిరి , తాజ్ బాబా,పురం వెంకట్, సైదులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *