కేటిఆర్ కు తొలి డోస్ టీకా

కొవిడ్ టీకా తీసుకున్న మంత్రి కేటీఆర్ 

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఐటీ మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారం కొవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. తనకు టీకా వేసిన డాక్టర్‌ శ్రీకృష్ణ, నర్సు కెరినా జ్యోతికి మంత్రి ఈ సంద‌ర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా కరోనా విపత్తు వేళల్లో సేవలందిస్తున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అయిన ఆరోగ్య కార్యకర్తలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *