24న కోటి ముక్కోటి వృక్షార్చన

ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయండి

కాసర్ల నాగేందర్ రెడ్డి

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 24న ఒకే రోజు ఒకే గంటలో మూడు కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం లో తెలంగాణ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయ నాయకుల జన్మదినాన్ని పురస్కరించుకుని రోడ్ల నిండా కటౌట్లు, పోస్టర్స్ నింపి జనాల్ని ఇబ్బందికి గురి చేయకుండా జనహితం కోసం,ముందు తరాల కోసం, హరిత తెలంగాణ కోసం రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన ఈ బృహత్తరకార్యక్రమానికి సబ్బండ వర్ణాల నుండి హర్షం వ్యక్తమవుతున్నదని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ఎప్పటికీ కొనసాగించి ప్రపంచానికే తెలంగాణ రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా ఆదర్శంగా నిలబెట్టాలని నాగేందర్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *