కృష్ణమ్మ జల సవ్వడి

సాగర్ కు పెరిగిన ఇన్ ఫ్లో
ఎగువ శ్రీశైలం నుండి 424071 క్యూసెక్కుల రాక
ఒక్కరోజులోనే 13 అడుగులు చేరిన నీటి మట్టం
ఆగస్టు 5 లోపు గేట్లు ఎత్తేఅవకాశం
560కి చేరిన నీటి మట్టం

అక్షిత ప్రతినిధి, నాగార్జునసాగర్ :
ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాల కారణంగా ఎగువనున్న ప్రాజెక్టులన్నీ నిండడం తో వచ్చింది వచ్చినట్లుగా దిగువ ప్రాజెక్టులకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లను 20 అడుగుల మేరకు ఎత్తి దిగువకు 4,24,071 క్యూసెక్కుల వరద నీటిని సాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ ప్రాజెక్టు భారీగాఇన్ ఫ్లో తిరుగుతుంది. ఒక్క రోజులోనే సుమారు 13 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. దీంతో సాగర్ నీటిమట్టం శర వేగంగా పెరుగుతుంది. ఇదేవిధంగా నీటి ప్రవాహం కొనసాగుతూ ఉంటే ఆగస్టు 5 లోపు సాగర్ రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం సాయంత్రానికి సాగర్ జలాశయం నీటిమట్టం అడుగులుగా ఉంది . ఇది నీటి సామర్థ్యం 232.6268 టీఎంసీలకు సమానము విద్యుత్ ఉత్పాదన ద్వారా ప్రధాన జలవిద్యుత్ కేంద్రం నుంచి34,238 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది. జంటనగరాలకు తాగునీటి అవసరాల నిమిత్తం ఎస్ఎల్బీసీ ద్వారా 1100 కేసు కుల నీరు విడుదల కాగ మొత్తం ప్రాజెక్టు నుండి అవుట్ నిర్మల ఔట్ ఫ్లో 35, 238క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది. ఇక శ్రీశైలం నుండి 10 గేట్ల నుండి4,24,071 క్యూసెక్కుల నీరు సాగర్ జలాశయం వచ్చి చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైల జలాశయం నీటి మట్టం అడుగులుగా ఉంది. ఇది 209.5988 టీఎంసీలకు సమానము. శ్రీశైలానికి ఎగువప్రాజెక్టు నుండి4,46,070, క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *