ప్రజల సేవల్లో… కృష్ణయ్య నిబద్దత

కృష్ణయ్య సేవలు అనిర్వచనీయం

రైతులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో సిద్ధహస్తుడు

సీజీఎంగా పదోన్నతి పొందిన కృష్ణయ్యకు ఆత్మీయ సన్మానం

విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం శ్రీనివాస్
నల్గొండ, అక్షిత ప్రతినిధి :

విద్యుత్ శాఖలో నల్లగొండ సర్కిల్ లో సూపరింటెండెంట్ ఇంజినీర్ హోదాలో పనిచేస్తూ చీఫ్ జనరల్ మేనేజర్ గా పదోన్నతి పొందిన పప్పుల కృష్ణయ్య మన జిల్లాలో అందించిన సేవలు అనిర్వచనీయమని బీసీ జేఏసీ నేత, విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు మారం శ్రీనివాస్ అన్నారు. ఐపీసీ, ఆర్ఏసీ కార్పొరేట్ కార్యాలయం చీఫ్ జనరల్ మేనేజర్ గా (సీజీఎం) పదోన్నతి పొందిన కృష్ణయ్యను నల్లగొండ జిల్లా బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మారం శ్రీనివాస్ మాట్లాడారు. కృష్ణయ్య తన పదవీ కాలంలో రైతులు, ఉద్యోగుల సమస్యలను సునాయాసంగా పరిష్కరించేవారని అన్నారు. క్రమశిక్షణతో, అకుంఠిత దీక్షతో, అంకిత భావంతో పనిచేసిన ఆయన ఎస్ఈ హోదాలో నిజాయితీ అధికారిగా అందరి మన్ననలను పొందారని అన్నారు. సీజీఎంగా పదోన్నతిపై వెళ్తున్న కృష్ణయ్య తన పదవీ కాలంలో మరింత మెరుగైన సేవలందించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. వినియోగదారుల సమస్యల పట్ల తక్షణమే స్పందించేవారని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను తెలుసుకొని సాధారణ బదిలీలకు, పదోన్నతులకు సహకరించేవారని అన్నారు. రాష్ట్ర ఉద్యోగుల పదవీ విరమణ వయసును ప్రభుత్వం 61ఏండ్లకు పెంచడంతో కృష్ణయ్యకు మరో రెండేండ్లు పనిచేసే అవకాశం లభించిందన్నారు.ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61కు పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు మారం శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజినల్ ఇంజినీర్ విద్యాసాగర్ , నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వి. గిరి, సత్యనారాయణ, జెంజీరాల వెంకన్న, వెంకటేశం, దాసయ్య,రాజశేఖర్, దామోదర్, గంజి పాండు, గంజి వెంకటేశ్వర్లు, పాండురంగ, ఆర్ఎన్ కుమార్, హరికిషన్, రవి, గోపికృష్ణ, వీరన్న, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *