కె ఎల్ రావు విగ్రహానికి పూలమాలలు

మునగాల, అక్షిత న్యూస్ :
మునగాల మండలం రేపాల గ్రామంలో
తెలంగాణ మాండలిక నాటక రచయిత, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సమకాలికులు,రేపాల గ్రామ వెలుగు నాట్యమండలి వ్యవస్థాపకులు,
కోదాటి లక్ష్మీ నరసింహారావు (కె.ఎల్.రావు) 18వ వర్ధంతి వేడుకలు గ్రామ వెలుగు నాట్యమండలి మరియు కె.ఎల్. మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
రేపాల గ్రామంలోని ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గ్రామ వెలుగు నాట్యమండలి అధ్యక్షుడు పోనుగోటి రంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో ఆనాటి పరిస్థితులను తన రచనల ద్వారా సమాజానికి అందించిన తొలి తరం తెలంగాణ మాండలిక రచయిత గా కె.ఎల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. రేపాల గ్రామంలో గ్రామ వెలుగు నాట్యమండలి స్థాపించి ప్రతి సంవత్సరం జరిగే
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ సామాజిక నాటకాలు ప్రదర్శింపజేసీ,అనేక మంది సినీ దిగ్గజాలను రేపాలకు తీసుకొచ్చిన ఘనత ఆయనకు దక్కుతుందని అన్నారు.ఇప్పటికీ ఆయన చూపిన బాటలో గ్రామ వెలుగు నాట్యమండలి ప్రతీ సంవత్సరం నాటక ప్రదర్శనలు ఇస్తూ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కళాకారుడు ఉప్పులూరి నరసింహులు,కె.ఎల్ మెమెరియల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పందిరి పుల్లారెడ్డి, సభ్యులు పల్లి అమృతారెడ్డి, గ్రామవెలుగు నాట్య మండలి సభ్యులు కుంటిగొర్ల కృష్ణమూర్తి,తోకల సైదులు,రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *