జర్నలిస్టు ఖలీల్ మృతి బాధాకరం

భాస్కర్ రావు పరామర్శ

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : మిర్యాలగూడ పట్టణంలోని 23వ వార్డు-అశోక్ నగర్ కాలనీకి చెందిన సీనియర్ జర్నలిస్ట్, లఘు చిత్ర దర్శకులు సయ్యద్ ఖలీల్ (51) మృతి చెందారు. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ఖలీల్ నివాసానికి చేరుకొని ఆయన భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఖలీల్ కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రజలను చైతన్యపరిచేందుకు ఖలీల్ పలు లఘు చిత్రాలకు దర్శకత్వం వహించారని అన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. ఎమ్మెల్యేతో పాటు కౌన్సిలర్ ఇలియాస్, మోసిన్ అలీ, దోసపాటి శ్రీనివాస్, మర్రి ఎలియాస్, మురళి యాదవ్ తదితరులు ఖలీల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *