కేసీఆర్ తోనే తెలంగాణ ప్రగతి

 మంత్రి కేటీఆర్

శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి :
రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రం అన్ని వైపులా విస్త‌రిస్తున్న‌ది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో స‌ర్వ‌తోముఖాభివృద్ధి సాధిస్తుందని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. సోమవారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం నందు నూతనంగా రూ.15.86 కోట్లతో నిర్మించిన లింక్ రోడ్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మౌలిక వ‌స‌తుల విస్త‌ర‌ణ‌లో కూడా దూసుకుపోతున్నాం. న‌గ‌రాల‌కు అభివృద్ధి సూచిక‌లుగా నిలిచేది ర‌హ‌దారులు, హైద‌రాబాద్ పెరుగుతున్న జ‌నాభా, జ‌న‌సాంద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని ర‌హ‌దారుల‌ను అభివృద్ధి చేస్తున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎస్ఆర్డీపీలో భాగంగా వంతెన‌లు, అండ‌ర్ పాస్‌లు నిర్మిస్తున్నాం అని మంత్రి తెలిపారు. రూ. 6 వేల కోట్ల‌తో ఎస్ఆర్డీపీ ప‌నులు కొన‌సాగుతున్నాయి. ఎస్ఆర్డీపీతో పాటు సీఆర్ఎంపీ కింద రూ. 1800 కోట్ల‌తో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని తెలిపారు. వీటితో అద‌నంగా హైద‌రాబాద్ రోడ్డు డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ కింద మొద‌టి ద‌శ‌లో రూ. 313.65 కోట్ల‌తో 22 లింకు రోడ్ల నిర్మాణం చేపడుతున్నామ‌ని తెలిపారు. ఇప్ప‌టికే 16 రోడ్ల‌ను పూర్తి చేశామ‌న్నారు. త్వ‌ర‌లోనే మ‌రో 6 రోడ్ల‌ను పూర్తి చేస్తామ‌ని చెప్పారు. ఇవాళ ప్రారంభించుకున్న‌ 5 లింక్ రోడ్ల నిర్మాణం రూ. 27.43 కోట్ల వ్య‌యంతో చేప‌ట్టామ‌ని పేర్కొన్నారు. రెండో ద‌శ‌లో రూ. 65 కోట్ల‌తో నాలుగు రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటికి అద‌నంగా రూ. 230 కోట్ల‌తో మ‌రో 13 రోడ్ల‌ను అభివృద్ధి చేస్తామ‌ని పేర్కొన్నారు. మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా రోడ్ల నిర్మాణం చేప‌డుతున్నామ‌ని పేర్కొన్నారు. ట్రాఫిక్, ప్ర‌యాణ దూరం త‌గ్గించేలా లింక్ రోడ్ల‌ను పూర్తి చేస్తున్నామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

పక్కా ప్రణాళికతోనే ప్రగతి
జగదీశ్వర్ గౌడ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి మున్సిపల్ శాఖమంత్రివర్యులు కేటీఆర్ దిశానిర్దేశంలో పక్క ప్రణాళికతో ముందుకు సాగుతుందని
జి.హెచ్.ఎం.సి అభివృద్ధి కోసం, ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసే విధంగా నూతన లింక్ రోడ్ల పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసువచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ కు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ ధన్య వాదాలు తెలిపారు. సోమవారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని కొండాపూర్ ఆర్.టి.ఏ కార్యాలయం నందు నూతనంగా రూ.15.86 కోట్లతో నిర్మించిన లింక్ రోడ్డును తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖమంత్రివర్యులు కేటీఆర్ , విద్యా శాఖమంత్రి శ్రీమతి పి.సబితా ఇంద్రా రెడ్డి ,శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరేకపూడి గాంధీ ,ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారన్నారు. మాదాపూర్,హఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్లు శ్రీమతి వి.పూజిత జగదీశ్వర్ గౌడ్, శేరిలింగంపల్లి కార్పొరేటర్లు హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్ ,శ్రీమతి
మంజుల రఘునాథ్ రెడ్డి ,శ్రీమతి రోజా రంగారావు ,దొడ్ల వెంకటేష్ గౌడ్ ,నార్నే శ్రీనివాస్ , జులపల్లి సత్యనారాయణ ,మాజీ కార్పొరేటర్ సాయిబాబా ,అధికారులు జి.హెచ్.ఎం.సి కమీషనర్ లోకేష్ కుమార్ ,జోనల్ కమీషనర్ రవి కిరణ్ ,సిఈ జియాఉద్దీన్,డిప్యూటీ కమీషనర్ వెంకన్న, డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు,వార్డ్ ఎరియా కమిటీ సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *