కట్టా కుటుంబానికి కటికం పరామర్శ

వేములపల్లి, అక్షిత ప్రతినిధి : టీఆర్ఎస్ జిల్లా నాయకులు కట్టా మల్లేష్ గౌడ్ సతీమణి జానకమ్మ ఇటీవల మృతి చెందడం పట్ల ఆ కుటుంబానికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ రాష్ట్ర గీత కార్మిక సహకార సంస్థ చైర్మన్ కటికo సత్తయ్య గౌడ్ పరామర్శించారు. సోమవారం వేములపల్లి మండలం శెట్టిపాలెంలో కట్టా మల్లేష్ గౌడ్ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదార్చారు. మల్లేష్ గౌడ్ సతీమణి జానకమ్మ మృతితో దుఃఖంలో ఉన్న కుటుంబానికి కటికం తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గౌరు శ్రీనివాస్, వేములపల్లి ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు జేరిపోతుల రాములు గౌడ్, మార్కెట్ డైరెక్టర్ పుట్టల భాస్కర్, కట్టా వెంకటయ్య, మాజీ సింగిల్ విండో చైర్మన్ కాట్రగడ్డ రాజ గోపాల్ రావ్, కంచర్ల జనార్దన్ రెడ్డి, కోయలకొండ ప్రదీప్ కుమార్, బంటు శ్రీనివాస్, సైదిరెడ్డి, కట్టా పెద వెంకటయ్య, బోయ సునీల్, కట్టా సైదులు, పగడాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *