ఆడపిల్లకు వరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 

సూర్యాపేట అర్బన్, రూరల్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

సూర్యాపేట, అక్షిత బ్యూరో :

పేదింటి ఆడ పిల్లలకు వరం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పధకమని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం రోజున క్యాంప్ కార్యాలయంలో సూర్యాపేట అర్బన్, రూరల్ కు చెందిన 146 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి పేదకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని, కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్ పధకాలు అద్భుతమైన పదకాలని అన్నారు. సూర్యాపేట అర్బన్ 85 మంది, సూర్యాపేట రూరల్ 61 మందికి మొత్తం 146 మందికి ఒక కోటి నలుబై ఆరు లక్షలు విలువగల చెక్కులు లబ్ధిదారులకు మంత్రి అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పి. అన్న పూర్ణ, ఆర్.డి. ఓ రాజేంద్ర కుమార్, తహశీల్దార్ వెంకన్న, ఎంపీపీ రవీంద్ర రెడ్డీ, జెడ్పీటీసీ జీడి బిక్షం, మార్కెట్ కమిటీ చైర్మన్ లలితా ఆనంద్, కౌన్సిలర్ల, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *