కళ్యాణ మండపాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వ విఫ్, ఎమ్మెల్యే గువ్వల బాల రాజు
అచ్చంపేట, అక్షిత న్యూస్: అచ్చంపేట
పట్టణంలోని శ్రీ మార్కండేయ శివాలయంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని శుక్రవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలకమడలి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చెందిందని నేడు కళ్యాణ మండపం కూడా పూర్తి చేయడం జరిగిందని, కళ్యాణ మండపాన్ని ప్రారంభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేనేత అన్నలకు చేనేత బందు ప్రవేశపెడుతుందని, నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ నరసింహగౌడ్, వైస్ చైర్మన్ శైలజ రెడ్డి, చైర్మన్ కృష్ణమూర్తి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మనోహర్, పదర జడ్పిటిసి రాంబాబు, మూడో వార్డు కౌన్సిలర్ సోమ్లానాయక్, పట్టణ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *