పేదింటి ఆడబిడ్డలకు పెద్దన్న కేసీఆర్

*ఆడపిల్లకు వరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పధకం*

*మంత్రి జగదీష్ రెడ్డి*

సూర్యాపేట, అక్షిత ప్రతినిధి : పేదింటి ఆడ పిల్లలకు వరం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పధకమని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో చివ్వేంల మండల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి పేదకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని, కళ్యాణ లక్ష్మి, షాది ముభారాక్ పధకాలు అద్భుతమైన పదకాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ సంజీవ్ నాయక్, ఎంపీపీ కుమారి బాబు నాయక్, వైస్ ఎంపీపీ జీవన్ రెడ్డి, కుడకుడ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గుర్రం సత్యనారాయణ, రౌతు నరసింహారావు, కౌన్సిలర్లు రవి నాయక్, విజయలక్ష్మి, భాషా మున్యా నాయక్ తండ సర్పంచ్ బికారు నాయక్ ,ఎంపీటీసీ సుశీల సాగర్ నాయక్,టీఆర్ ఎస్ నాయకులు మనోజ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *