కాల్వపల్లి గులాబీ అధ్యక్షులుగా చెన్నబోయిన

మిర్యాలగూడ రూరల్, అక్షిత న్యూస్ : మిర్యాలగూడ మండల పరిధిలోని కాల్వపల్లి గ్రామ కమిటీలు గురువారం సర్పంచ్ రామరాజు, ఎంపిటిసి తరికోప్పుల సైదులు, మాజీ ఎంపిటిసి జెట్టి లింగయ్యల ఆధ్వర్యంలో పూర్తి అయ్యాయి. కాల్వపల్లి టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా చెన్నబోయిన వీరయ్య, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ సాదిక్, ఉపాదక్షులుగా పెద్ద వెంకటయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వీరితో పాటు గ్రామ రైతువిభాగం అధ్యక్షులుగా వీరపల్లి  సైదయ్య, కార్యదర్శిగా దొండ శ్రీను, యూత్ అధ్యక్షులుగా దొండ రవి, బీసి సెల్ అధ్యక్షులుగా బత్తుల ఆంజనేయులు, మైనారిటీ అధ్యక్షులుగా సయ్యద్ గౌస్, మహిళా అధ్యక్షురాలుగా పిట్టల జానకమ్మ, ఎస్సీ అధ్యక్షులుగా మండల అంజయ్య, కార్మికవిభాగం అధ్యక్షులుగా దుండిగల వెంకన్న మరియు కమిటీ కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *