కష్టాలు… కన్నీళ్లలో ప్రజల వెంటే… జూపల్లి

అవసరం ఉన్నప్పుడు వచ్చే మనిషిని కాదు                    మీ అవసరాన్ని తీర్చే వ్యక్తిని

మియ్యాపూర్ గ్రామంలో మార్నింగ్ వాక్
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

మహబూబ్ నగర్,అక్షిత ప్రతినిధి :  చిన్నంబావి మండల పరిధిలోని మియాపూర్ గ్రామంలో మాజీ మంత్రివర్యులు *జూపల్లి కృష్ణారావు మండల తాజా మాజీ ప్రజా ప్రతినిధులతో పాటు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలతో కలిసి నిర్వహించిన మార్నింగ్ వాక్ లో గ్రామ ప్రజలతో జూపల్లి ముచ్చటించారు.అవసరం ఉన్నప్పుడు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వచ్చే మనిషిని కాదని పదవి ఉన్నా లేకున్నా ప్రజల్లోనే ఉంటానని మీ అవసరాలు తీర్చే వ్యక్తిగా మీ వెంటే ఉంటానని ఆనాడు ఉచిత కరెంటు కోసం కొట్లాడి జైలుకు వెళ్లిన చరిత్ర నాదని ప్రజల ఆకాంక్షలను ఎప్పుడు కూడా వమ్ము చేయనని జూపల్లి గారు స్పష్టం చేశారు. ముందుగా గ్రామంలో ప్రతి వీధి తిరుగుతూ ప్రజలను ఆప్యాయతతో పలకరిస్తూ తమ యొక్క ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా గ్రామ ఆడపడుచు ఆప్యాయంగా పెట్టిన అల్పాహారం పొంగనాలను స్వీకరించారు.అదేవిధంగా గ్రామంలో మంచినీటి సమస్య నెలకొందని నల్లాలు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారికి విన్నవించడంతో వెంటనే ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారికి ఫోన్ చేసి తక్షణమే నల్లా కలెక్షన్లు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరారు.వివిధ ప్రజా సమస్యలను పలువురు గ్రామ ప్రజలు జూపల్లి గారి దృష్టికి తీసుకువచ్చారు గ్రామంలో వివిధ కారణాలతో అనారోగ్యాలతో బాధపడుతున్న వారి కుటుంబాలను పరామర్శించారు.అనంతరం గ్రామ ముఖ్యులతో వివిధ ప్రజా సమస్యలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తాజా మాజీ ప్రజాప్రతినిధులు గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *