జర్నలిస్టులను అప్రతిష్టపాలు చేయొద్దు

విలేకరిని దూషించిన వ్యక్తిపై ఎస్ఐకి ఫిర్యాదు
ములుగు,అక్షిత బ్యూరో :
జర్నలిస్టుల పేరుతో డబ్బులు డిమాండ్ చేసిన విషయంలో జర్నలిస్టులను బదనాం చేయొద్దని తెలంగాణ సామాజిక రచయితల సంఘం పక్షాన ఖండిస్తూ పత్రిక ప్రకటన ఇచ్చిన సంద బాబుకు వంగ రవి అనే వ్యక్తి ఫోన్చేసి బెదిరిస్తూ,అసభ్య పదజాలంతో దూషించగా స్థానిక రిపోర్టర్ల సమక్షంలో ములుగు
ఎస్సై కి  పిర్యాదు చేశారు.  అవినీతిని వెలికి తీస్తున్న విలేకరులను డబ్బులు డిమాండ్ చేశారంటూ బదనం చేస్తున్న వ్యక్తి, విలేకర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న విషయంను ఖండిస్తూ పత్రిక ప్రకటన ఇచ్చిన సంద బాబును దూషించిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో సీనియర్ జర్నలిస్టులు కొట్టే రాజిరెడ్డి, సుంకరి సంపత్,గుర్రం శ్రీధర్,ముకులోత్ శరత్, కుంచం రమేష్, జర్నలిస్టులు సంఘ రంజిత్ కుమార్, చల్లగురుగుల రాజు,ఆవుల వెంకన్న, విశ్వదేవర విశ్వనాధ్,ఓరుగంటి బిక్షపతి,దొమ్మటి వెంకటేష్,గట్టు ప్రశాంత్,దిగ్యపోగు మనోజ్ కుమార్, జావీద్,పత్తి కోటేశ్వర్,సంద బాబులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *